News June 7, 2024
సెన్సెక్స్ ALL TIME HIGH
కౌంటింగ్ రోజున దారుణ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 3 రోజులు పైకెగిశాయి. ఇవాళ సెన్సెక్స్ ఒకదశలో 1,620 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 76,795కు చేరింది. చివరకు 76,694 వద్ద ముగిసింది. నిఫ్టీ 446 పాయింట్లు ఎగసి 23,267 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు రూ.7 లక్షల కోట్లు లాభపడ్డారు. రెపో రేట్లలో <<13395338>>RBI<<>> మార్పులు చేయకపోవడం, మోదీ 3.Oకు చేరువవడం మార్కెట్లకు కలిసి వచ్చినట్లు నిపుణుల అంచనా.
Similar News
News December 27, 2024
మాటలు తక్కువ.. పని ఎక్కువ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
News December 27, 2024
ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.
News December 27, 2024
సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్
సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.