News April 10, 2024
75 వేల ఎగువన ముగిసిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్ 75 వేల మార్క్ దాటింది. 354.45 పాయింట్లు లాభపడి 75,038 వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభంతో 22,753 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, రిలయన్స్, ఐటీసీ, ఎయిర్‌టెల్ వంటి షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి.
Similar News
News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.
News March 22, 2025
IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
News March 22, 2025
నేడు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

తమిళనాడులో అధికార డీఎంకే అధ్యక్షతన డీలిమిటేషన్‌పై నేడు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెన్నై చేరుకున్నారు. వారికి అక్కడి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం నేతలందరూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.