News June 12, 2024
నిర్మల 2.0లో సెన్సెక్స్ టార్గెట్ లక్ష!

కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.
Similar News
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 23, 2025
నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
APPLY NOW: జిప్మర్లో ఉద్యోగాలు

జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్సైట్: https://jipmer.edu.in/


