News September 13, 2024

సెన్సెక్స్ vs బంగారం: ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చిందంటే..

image

బంగారం ఇన్వెస్టర్ల పంట పండిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 15% రిటర్న్ ఇవ్వగా గోల్డ్ 16% అందించింది. 17% పెరిగిన నిఫ్టీతో గట్టిగా పోటీపడుతోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో పుత్తడి ఈ వారం 2% పెరిగింది. RBI, US, చైనా సైతం వడ్డీరేట్ల కోతకు మొగ్గుచూపడంతో ధర ఇంకా పెరగొచ్చు. MCX గోల్డ్ ఫ్యూచర్స్ త్వరలోనే రూ.75వేల స్థాయికి చేరొచ్చని నిపుణుల అంచనా.

Similar News

News October 5, 2024

రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..

image

అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్‌ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్‌కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!

News October 5, 2024

జమ్మూకశ్మీర్‌లో రాజకీయ వేడి

image

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌క‌ముందే JKలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. J&K Reorganisation Act, 2019 స‌హా జులై, 2023లో చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ ద్వారా ఐదుగురు MLAల‌ను LG నామినేట్ చేయగలరు. కేంద్ర హోం శాఖ సూచ‌ల‌న మేర‌కు ఆయ‌న ఐదుగురిని నియ‌మించ‌నున్నారు. వీరికి ప్ర‌భుత్వ ఏర్పాటులో భాగ‌స్వామ్యం క‌ల్పిస్తే Halfway Mark 45కి బ‌దులుగా 48 అవుతుంది. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి.

News October 5, 2024

హరియాణాలో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కే అనుకూలం

image

హరియాణాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్(45-50), CNN(59), రిపబ్లిక్ మ్యాట్రిజ్(55-62), దైనిక్ భాస్కర్(44-54) సంస్థలు అంచనా వేశాయి. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు ఉద్య‌మాలు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, నిరుద్యోగ స‌మ‌స్య‌లు, అగ్నివీర్ అంశాలు, మహిళా రెజ్లర్ల అందోళన బీజేపీకి ప్ర‌తికూలంగా మారిన‌ట్టు పేర్కొన్నాయి.