News November 5, 2024

సిక్కులు, హిందువుల విభజనే ఖలిస్థానీల టార్గెట్: కెనడా మాజీ మంత్రి

image

కెనడాలో సిక్కులు, హిందువులను విడదీయడమే ఖలిస్థానీల టార్గెట్ కావొచ్చని ఆ దేశ మాజీమంత్రి ఉజ్జల్ దేవ్ దోసాంజి అన్నారు. అక్కడి విభజన విత్తనాన్ని మెల్లగా భారత్‌లో నాటాలన్నదే ప్లాన్‌‌ అని పేర్కొన్నారు. ఖలిస్థానీ ఇష్యూపై అక్కడి నేతలు నిద్ర నటిస్తున్నారని, కనీసం ఆ పేరే ఎత్తడం లేదని విమర్శించారు. చాన్నాళ్లుగా ఖలిస్థానీ తీవ్రవాదం మరుగున పడిందని, ట్రూడో రాగానే మళ్లీ మొదలైందని వివరించారు.

Similar News

News December 13, 2024

రేపు కీలక ప్రకటన: మంచు విష్ణు

image

మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఓ ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు. తాను చేసే ప్రకటన మనసుకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో విష్ణు ఎలాంటి విషయం వెల్లడించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 13, 2024

అల్లు అర్జున్ విడుదల ఆలస్యం

image

చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాస్త ఆలస్యం కానుంది. న్యాయమూర్తి ఆదేశాల కాపీ సైట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత వాటిని జైలర్ వెరిఫై చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం తీర్పు కాపీ ప్రిపరేషన్‌లో ఉందని సమాచారం. దీంతో బన్నీ బయటకు వచ్చేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కాగా బన్నీకి స్వాగతం పలికేందుకు జైలు బయట భారీగా ఫ్యాన్స్, ఇంటి వద్ద కుటుంబీకులు వేచి చూస్తున్నారు.

News December 13, 2024

ఈ రోజు మార్కెట్ల‌ జోష్‌కు కార‌ణం ఇదే!

image

స్టాక్ మార్కెట్లు Fri ఉద‌యం నుంచి న‌ష్టాల్లో ప‌య‌నించినా మిడ్ సెష‌న్‌లో కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో తిరిగి పుంజుకున్నాయి. దీనికి ప్ర‌ధానంగా FIIల పెట్టుబ‌డుల ప్ర‌వాహం కార‌ణంగా క‌నిపిస్తోంది. DIIలు ₹732 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అయితే, FII/FPIలు ₹2,335 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. దీంతో కీల‌క రంగాలకు ల‌భించిన కొనుగోళ్ల మ‌ద్ద‌తు సూచీల రివ‌ర్స‌ల్‌కి కార‌ణ‌మైంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.