News September 12, 2024

సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1686: మొఘల్ సామ్రాజ్యంలో బీజాపూరు రాజ్యం విలీనం
1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1967: నటి అమల అక్కినేని జననం
1997: నటి శాన్వీ మేఘన జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం

Similar News

News October 5, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన KTR

image

TG: తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తొలిసారి స్పందించారు. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్‌పైనా వేస్తా’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్‌ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి KTR కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.

News October 5, 2024

రేపు భారత్VSపాక్ మ్యాచ్

image

భారత్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు రేపు(ఆదివారం) రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మహిళల T20WCలో భాగంగా దుబాయ్ వేదికగా మ.3.30కు ఇండియా-పాక్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో పోరు హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు గ్వాలియర్ స్టేడియంలో సూర్య సేన బంగ్లాదేశ్‌తో తొలి T20 ఆడనుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News October 5, 2024

గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.