News September 15, 2024

సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు

image

1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం
1892: పద్మభూషణ్ గ్రహీత, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

Similar News

News October 11, 2024

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉపవర్గాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

News October 11, 2024

సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం!

image

బారామ‌తికి సంబంధించి శ‌ర‌ద్ ప‌వార్ పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జ‌రిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాక‌రించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.

News October 11, 2024

రేపు ఏపీవ్యాప్తంగా వర్షాలు

image

ఏపీవ్యాప్తంగా రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.