News September 28, 2024

సెప్టెంబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1895: తెలుగు ప్రసిద్ధ కవి గుర్రం జాషువా జననం
1907: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జననం
1909: నటుడు, నిర్మాత పైడి జైరాజ్ జననం
1929: గాన కోకిల లతా మంగేష్కర్ జననం
1966: పూరీ జగన్నాథ్ జననం
1982: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ జననం
1895: ప్రముఖ జీవశాస్త్రవేత్త లూయిూ పాశ్చర్ మరణం
>>అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
>>ప్రపంచ రేబిస్ దినోత్సవం

Similar News

News September 28, 2024

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వర్గీకరణపై వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది.

News September 28, 2024

ఇంగ్లిష్ మీడియా.. మా మీద పడి ఏడవకండి: గవాస్కర్

image

చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు పిచ్ బాలేదంటూ ఇంగ్లిష్ వార్తాసంస్థలు ఏడ్చాయని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నారు. కాన్పూర్‌లో రెండో టెస్టు సందర్భంగా కామెంటరీలో ఆయన మాట్లాడారు. ‘జాగ్రత్తగా ఆడితే ఆ పిచ్‌పై సెంచరీ చేయొచ్చని అశ్విన్ ఆ టెస్టుకు ముందే అన్నారు. అదే చేసి చూపించారు. ఇంగ్లిష్ మీడియా మాత్రం ఇవేం పిచ్‌లు అంటూ మనపై పడి ఏడ్చింది. ఆ ఏడుపులు ఆపండి’ అని పేర్కొన్నారు.

News September 28, 2024

రూ.1000 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: మంత్రి

image

AP: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అమరావతిలో రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంగమేశ్వరం, అఖండ గోదావరి, శ్రీశైలం, సూర్యలంక బీచ్ ల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. అక్టోబర్ 15 నాటికి DPRలు సిద్ధం చేసి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.