News September 30, 2024

సెప్టెంబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1951: సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు జననం
1961: భారత మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిత్ జననం
1971: ఏపీ సీఎంగా పి.వి.నరసింహారావు ప్రమాణం
1980: మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం
1993: మహారాష్ట్ర లాతూర్ భూకంపంలో 10,000 మంది మరణం
☞ అంతర్జాతీయ అనువాద దినోత్సవం

Similar News

News November 22, 2025

డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ

image

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్‌లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.

News November 22, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో రేపు ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరి కోతల టైం కావడంతో ధాన్యం కుప్పలు వేసుకోవాలని, రంగుమారకుండా ఉండేందుకు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని రైతులకు సూచించింది.

News November 22, 2025

యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

image

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.