News September 30, 2024
సెప్టెంబర్ 30: చరిత్రలో ఈరోజు
1951: సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు జననం
1961: భారత మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిత్ జననం
1971: ఏపీ సీఎంగా పి.వి.నరసింహారావు ప్రమాణం
1980: మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం
1993: మహారాష్ట్ర లాతూర్ భూకంపంలో 10,000 మంది మరణం
☞ అంతర్జాతీయ అనువాద దినోత్సవం
Similar News
News October 12, 2024
మ్యాచ్‌కు వర్షం ముప్పు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.
News October 12, 2024
జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
News October 12, 2024
‘డిగ్రీ’లో అడ్మిషన్లు అంతంతమాత్రమే
TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.