News September 4, 2024

సెప్టెంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

1825: విద్యావేత్త, జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం
1935: తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం
1962: భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్ స్మిత జననం
1987: బాలీవుడ్ సింగర్ రితు పాతక్ జననం
1999: ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం

Similar News

News November 17, 2025

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News November 17, 2025

NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCL<<>>)లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు GATE -2025 అర్హత సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.560. SC,ST,PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://neepco.co.in

News November 17, 2025

మణికంఠుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం

image

శబరి యాత్రకు వెళ్లేవారికి పేరూర్‌తోడు అనే పవిత్ర వాగు గురించి తెలిసే ఉంటుంది. ఇది ఎరుమలై నుంచి 5KM దూరంలో ఉంటుంది. పూర్వం అయ్యప్ప స్వామి పులి పాల కోసం ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఆగి, విశ్రాంతి తీసుకున్నట్లుగా చెబుతారు. ఈ కారణంగానే పేరూర్‌తోడును ఆ చుట్టుపక్కల మెచ్చిలి సుబరి పీఠం వరకు కనిపించే అడవిని ‘పూంగా’ (ఉద్యానవనం)గా భావిస్తారు. ఈ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా కొలచి పూజిస్తారు. <<-se>>#AyyappaMala<<>>