News October 2, 2024
సెప్టెంబర్: ఏపీ, TG జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?

జీఎస్టీ కింద సెప్టెంబర్ నెలకు గాను ఏపీకి రూ.3506 కోట్లు, తెలంగాణకు రూ.5,267 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే TG వసూళ్లు 1శాతం పెరగ్గా, ఏపీ వసూళ్లు 4% తగ్గినట్లు పేర్కొంది. ఇటు SGST, IGSTలో రాష్ట్ర వాటా కింద SEP నెల వరకు తెలంగాణకు రూ.21,504 కోట్లు, ఏపీకి రూ.16,393 కోట్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇందులో రెండు రాష్ట్రాలకు 7శాతం ఆదాయం పెరిగింది.
Similar News
News January 26, 2026
NZతో చివరి 2 T20లకు తిలక్ దూరం

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నాటికి తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.
News January 26, 2026
నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ కాంపా) 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://moef.gov.in/
News January 26, 2026
మట్టెవాడ భోగేశ్వర ఆలయ విశేషాలు

వరంగల్(D) మట్టెవాడలోని భోగేశ్వర ఆలయం చాలా విశిష్టమైనది. ఇక్కడి శివలింగం కింద 11 లింగాలు ఉండటం విశేషం. అందుకే ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేక ఫలం దక్కుతుందని నమ్మకం. ఈ లింగానికి ఎన్ని నీళ్లతో అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా అంతర్ధానం కావడం మరో విశేషం. ప్రతిరోజు రాత్రి ఒక పాము(భోగి) వచ్చి స్వామిని సేవిస్తుందని, అందుకే దీనికి భోగేశ్వర ఆలయమని పేరు వచ్చిందని ప్రతీతి.


