News October 2, 2024

సెప్టెంబర్: ఏపీ, TG జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?

image

జీఎస్టీ కింద సెప్టెంబర్ నెలకు గాను ఏపీకి రూ.3506 కోట్లు, తెలంగాణకు రూ.5,267 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే TG వసూళ్లు 1శాతం పెరగ్గా, ఏపీ వసూళ్లు 4% తగ్గినట్లు పేర్కొంది. ఇటు SGST, IGSTలో రాష్ట్ర వాటా కింద SEP నెల వరకు తెలంగాణకు రూ.21,504 కోట్లు, ఏపీకి రూ.16,393 కోట్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇందులో రెండు రాష్ట్రాలకు 7శాతం ఆదాయం పెరిగింది.

Similar News

News October 11, 2024

Hello నిద్రరావడం లేదు.. ఏం చేయమంటారు!

image

మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ టెలీ మానస్‌కు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ గురించే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. 2022 అక్టోబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు 3.5 లక్షల కాల్స్ వచ్చాయి. వీటిని విశ్లేషిస్తే నిద్రా భంగం 14%, మూడ్ బాగాలేకపోవడం 14%, స్ట్రెస్ 11%, యాంగ్జైటీ 9% టాప్4లో ఉన్నాయి. సూసైడ్ కాల్స్ 3% కన్నా తక్కువే రావడం గమనార్హం. హెల్ప్‌లైన్‌కు పురుషులు 56%, 18-45 వయస్కులు 72% కాల్ చేశారు.

News October 11, 2024

భార్య సూచన.. రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది

image

మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్‌కు ₹25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతోంది. అతను 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నారు. ఈ ఏడాదీ ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు(ఒక్కోటి ₹500) కొనుగోలు చేశారు. తర్వాత ఓ టికెట్‌ను స్నేహితునికి ఇవ్వాలనుకోగా భార్య అతడిని ఆపింది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. ఆ టికెట్‌కే ₹25 కోట్ల బహుమతి దక్కింది.

News October 11, 2024

రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో ఇప్పటికే రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ బుక్‌లో పేర్లు ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోకి ఇండస్ట్రీలు రాకుండా అడ్డుకునే వారిని వదలం. వైసీపీ తరిమేసిన పరిశ్రమలను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.