News August 28, 2024

‘సరిపోదా శనివారం’ మూవీకి సీక్వెల్.. హీరో ఏమన్నారంటే?

image

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రమోషన్లలో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీకి సీక్వెల్‌కు అవకాశం ఉందని చెప్పారు. ఈ మూవీ విజయం సాధిస్తే తప్పకుండా ప్లాన్ చేస్తామని తెలిపారు. కాగా ‘సరిపోదా శనివారం’ అని టైటిల్ పెట్టడానికి గల రీజన్ సినిమా ప్రారంభమైన 5 నిమిషాలకే తెలుస్తుందన్నారు.

Similar News

News December 12, 2024

6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP

image

AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్‌లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.

News December 12, 2024

ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

image

దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.

News December 12, 2024

కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.