News August 6, 2024
లంకతో సిరీస్.. రోహిత్, కోహ్లీ అవసరం లేదు: నెహ్రా
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని మాజీ బౌలర్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డారు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. ‘కోహ్లీ, రోహిత్ గురించి గంభీర్‌కు తెలియనిదేముంది? అతనేం విదేశీ కోచ్ కాదు కదా? స్వదేశంలో జరిగే సిరీస్‌లలో వాళ్లిద్దరినీ ఆడించొచ్చు. గంభీర్ అనుసరిస్తున్న విధానం తప్పని అనడం లేదు. కానీ సిరీస్‌లో ఈ వ్యూహం పాటిస్తే బాగుండేది’ అని అన్నారు.
Similar News
News September 19, 2024
9 ఏళ్లకే యాప్.. 13 ఏళ్లకే సొంత కంపెనీ!
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత కేరళకు చెందిన ఆధిత్యన్ రాజేశ్‌కు సరితూగుతుంది. 9 ఏళ్లకే మొదటి మొబైల్ యాప్‌ని సృష్టించాడు. 13 ఏళ్లకే సైట్స్, లోగోస్ క్రియేట్ చేసే కంపెనీ స్థాపించాడు. తోటివారు ఖాళీ సమయంలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఇతను సాఫ్ట్‌వేర్‌పై ట్రైనింగ్ తీసుకున్నాడు. తాను స్థాపించిన ట్రినెట్ సొల్యూషన్స్‌ని పాఠశాల స్నేహితుల సహాయంతో నడిపిస్తున్నాడు. అతని కంపెనీకి 12 మంది క్లయింట్స్ ఉన్నారు.
News September 19, 2024
ఆయన డాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్: ఎన్టీఆర్
తమిళ హీరో విజయ్ డాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని ఎన్టీఆర్ అన్నారు. అతి చూపించకుండా ఉండాలని, విజయ్ స్టెప్పులు కూల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయని చెప్పారు. డాన్స్ అనేది ఫైట్, జిమ్నాస్టిక్స్ చేసినట్లుగా ఉండొద్దన్నారు. శ్రమపడనట్లుగా డాన్స్ ఉండాలని విజయ్ అలాగే చేస్తారని కొనియాడారు. అప్పట్లో తామిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు. కాగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ ఈ నెల 27న విడుదల కానుంది.
News September 19, 2024
విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన
TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్‌కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.