News May 7, 2025
సమాజానికి సేవ చేస్తే ఆ ఆనందమే వేరు: తమన్

సమాజానికి సేవ చేస్తే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన తలసేమియా సెంటర్ ప్రారంభించారు. ‘నారా భువనేశ్వరి చేసే మంచి పనులకు నేనెప్పుడూ అండగా ఉంటా. తలసేమియా రోగుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలని ప్రచారం చేస్తా. జనాలకు మనం ఎంతో కొంత తిరిగిస్తేనే సంతోషం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!

IPL: కోల్‌కతా వేదికగా ఇవాళ KKR, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచుల్లో ఇరుజట్లు ఓటమి చెందాయి. దీంతో ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని కసితో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు 30 సార్లు తలపడగా KKR 20 సార్లు విజయం సాధించింది. కోల్‌కతాలో అయితే 11 సార్లు పోటీపడగా 8 గెలుపులతో KKRదే పైచేయిగా ఉంది. బ్యాటింగ్‌లో ఇరుజట్లు బలంగానే ఉన్నా బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనత కన్పిస్తోంది.
News April 2, 2026
ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>
News April 2, 2026
సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.


