News August 5, 2024
కేసీఆర్, హరీశ్‌రావుకు సెషన్స్ కోర్టు నోటీసులు
TG: మేడిగడ్డ పిల్లర్‌కు పగుళ్లు ఏర్పడిన వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సహా 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సూచనల మేరకు నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. విచారణకు హాజరుకావాలని కేసీఆర్, తదితరులను ఆదేశించింది.
Similar News
News September 10, 2024
PAC మీటింగ్‌లో సెబీ చీఫ్‌పై BJP vs TMC
పార్లమెంట్ PAC మీటింగ్‌లో సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై BJP, TMC మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమెను కమిటీ ముందుకు పిలిపించాలని సౌగతా రాయ్ చేసిన డిమాండ్‌ను నిశికాంత్ దూబే (BJP) వ్యతిరేకించారు. కేంద్రం ఆదేశించకుండా కాగ్ ప్రిన్సిపల్ ఆడిటర్ సెబీ ఖాతాలను ఆడిట్ చేయలేరన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అవకతవకలపై పక్కా ఆధారాలు లేకుండా పీఏసీ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించలేదన్నారు.
News September 10, 2024
ODI హిస్టరీలో తొలి ‘డబుల్ సెంచరీ’ ఎవరిదో తెలుసా?
ODI క్రికెట్‌లో ‘డబుల్ సెంచరీ’ అనగానే సచిన్, రోహిత్ గుర్తుకొస్తారు. సచిన్ 2010లో తొలిసారి 200* రన్స్ బాదారు. కానీ అంతకు 13ఏళ్ల ముందే ఆసీస్ మహిళా క్రికెటర్ బిలిందా క్లార్క్ 229* పరుగులు చేశారు. ODI క్రికెట్ హిస్టరీలో ఇదే తొలి డబుల్ సెంచరీ. ముంబై వేదికగా జరిగిన 1997 WCలో డెన్మార్క్‌పై ఈ ఫీట్ నమోదుచేశారు. ఆమె 54వ పుట్టినరోజు నేడు. ఈ ప్లేయర్ 118 వన్డేల్లో 4,844 రన్స్, 15 టెస్టుల్లో 919 రన్స్ చేశారు.
News September 10, 2024
ఈ నెల 16న ఢిల్లీకి రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై వారితో చర్చించే అవకాశముంది.