News July 8, 2024

సేవామూర్తికి ‘సేవారత్న’ అవార్డు!

image

రూపాయికే ఇడ్లీలను అందిస్తూ ఎంతోమంది కడుపు నింపుతోన్న TNకి చెందిన 84 ఏళ్ల కమలతల్‌ను ఏపీ, TG రాష్ట్రాల మంత్రులు సత్కరించారు. ఓ ప్రైవేటు అవార్డుల వేడుకలో ఆమెను ‘సేవారత్న’తో సత్కరించి రూ.50వేల సాయాన్ని అందించారు. గత 35 ఏళ్లుగా ఆమె రూ.1కే ఇడ్లీలు అందిస్తున్నారు. 600ప్లేట్లు విక్రయిస్తూ తన అవసరాల కోసం రూ.100 చొప్పున ఆదా చేస్తున్నారు. ఆమెను అభినందించాల్సిందేనంటూ IAS జయేశ్ రంజన్ ఫొటోలను Xలో పంచుకున్నారు.

Similar News

News October 6, 2024

భారత్ టార్గెట్ 106 రన్స్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.

News October 6, 2024

కుమారులు సినిమాల్లోకి వస్తారా? జూ.ఎన్టీఆర్ సమాధానమిదే

image

తన కుమారులు అభయ్, భార్గవ్‌లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్‌లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.

News October 6, 2024

అందరి కళ్లు అతడిపైనే!

image

మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్‌తో తొలి T20 ప్రారంభం కానుంది. అయితే తొలిసారి భారత జట్టుకు ఎంపికైన యంగ్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ మయాంక్‌ ఆడితే అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. IPLలో లక్నో తరఫున ఆడిన ఈ యువ పేసర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాగా ఇతడికి హర్షిత్‌రాణా రూపంలో పోటీ ఉంది. ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?