News June 10, 2024
కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!
ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇవాళ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కుమారస్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝీ (బిహార్) ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ, మిగతా ఇద్దరు ఇతర పార్టీలకు చెందినవారు.
Similar News
News December 21, 2024
పాప్‌కార్న్.. GST @ 5%, 12%, 18%!
సినిమా థియేటర్లు సహా ఇతర లీజర్, ఎంటర్‌టైన్మెంట్ సమయాల్లో కొనే పాప్‌కార్న్ రకాన్ని బట్టి GST మారుతుంది. మీరు ప్యాకింగ్ లేని రెడీ టు ఈట్ సాల్ట్ పాప్‌కార్న్ కొంటే 5% GST వర్తిస్తుంది. ఇక ప్యాకింగ్, బ్రాండ్ లేబ్లింగ్ ఉన్నది కొంటే 12% పన్ను చెల్లించాలి. క్యారమెల్ వంటి షుగర్ కోటెడ్ వేరియంట్ కొంటే 18% ట్యాక్స్ పడుతుంది.
News December 21, 2024
మహారాష్ట్ర నూతన మంత్రివర్గం ఖరారు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. హోం, విద్యుత్, న్యాయ శాఖ పదవులు తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక, ప్లానింగ్ శాఖను అజిత్ పవార్‌కు, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలను ఏక్‌నాథ్ శిండేకు అప్పగించారు. రెవెన్యూ-చంద్రశేఖర్ ప్రభావతి, వ్యవసాయ-మాణిక్‌రావు సరస్వతి, సివిల్ సప్లై-ధంజయ్ రుక్మిణి ముండే, పరిశ్రమలు-ఉదయ్ స్వరూప రవిచంద్ర, ఐటీ-ఆశిశ్ మీనాల్.
News December 21, 2024
పాత కార్లపై జీఎస్టీ 18శాతానికి పెంపు
కంపెనీల నుంచి పాత కార్లు కొనేవారిపై GST భారం పడనుంది. పాత ఎలక్ట్రానిక్‌తో పాటు పెట్రోల్, డీజిల్ కార్లపై GSTని 18శాతానికి పెంచుతున్నట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో ఈవీలపై 5%, పెట్రోల్, డీజిల్ వాహనాలపై 12% GST ఉండేది. అయితే వ్యక్తుల మధ్య ఈవీల క్రయవిక్రయాలు జరిగితే జీఎస్టీ ఉండదని ఆమె చెప్పారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై GST తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదన్నారు.