News April 6, 2024
రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సగటున 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచించింది. వడగాలులు వీచే మండలాల జాబితా కోసం ఇక్కడ <
Similar News
News January 22, 2025
తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
News January 22, 2025
జనవరి 22: చరిత్రలో ఈ రోజు
1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1972: సినీ నటి నమ్రత జననం
1989: సినీ నటుడు నాగశౌర్య జననం
2014: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) మరణం
News January 22, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.