News April 29, 2024
రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 40-44 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 90 మండలాల్లో తీవ్ర వడగాలులు, 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్రతను బట్టి పలు మండలాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ మండలాల జాబితాను ఇక్కడ <
Similar News
News April 19, 2026
IPLలో నేడు హోరాహోరీ పోరు

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 19, 2026
భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2026
చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>


