News April 29, 2024

కర్ణాటక రాజకీయాల్లో సెక్స్ వీడియోల ప్రకంపనలు

image

కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ సెక్స్ వీడియోలు కుదిపేస్తున్నాయి. ఆయన పెన్ డ్రైవ్‌లోని వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. తాజాగా ప్రజ్వల్ తండ్రి రేవణ్ణపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ సెక్స్ వీడియోలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా కాంగ్రెస్ వీటినే ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీని ఇరుకున పెడుతోంది.

Similar News

News April 12, 2026

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.

News April 12, 2026

ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

image

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.