News August 26, 2024
నటుడిపై లైంగిక ఆరోపణలు
మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా మలయాళ నటుడు, మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం ఆఫీస్ బేరర్ బాబూరాజ్ అలువాలోని ఇంట్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన బాబూరాజ్, వీటి వెనుక కొంతమంది స్వార్థపరులు ఉన్నారని అన్నారు. ఇప్పటికే దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిక్, జయసూర్య, ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవేల బాబులపై ఆరోపణలు వచ్చాయి.
Similar News
News September 10, 2024
సల్మాన్-రష్మిక మూవీలో కాజల్ అగర్వాల్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఏ రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
News September 10, 2024
సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనాలి: సీఎం
AP: విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు సాధారణ స్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆ ప్రాంత మంత్రులకు సూచించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75లక్షల మందికి సహాయక చర్యలు అందించాలన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు.
News September 10, 2024
వారితో మనసు విప్పి మాట్లాడండి
ఈమధ్య సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యం అన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే వారు ఆత్మహత్య చేసుకుంటామని నేరుగా చెప్పకపోయినా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇస్తారని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రవర్తనలో మార్పు, ముభావంగా ఉండటం, నిరాశనిస్పృహలు ఉంటే వారితో మాట్లాడి, మనోధైర్యం నింపితే ఆత్మహత్య నుంచి కాపాడవచ్చంటున్నాయి.
>> నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం.