News September 26, 2024

21 మందిపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌లో 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ నేరాలను ప్రోత్సహించిన ఆ స్కూల్ మాజీ హెడ్ మాస్టర్, హిందీ టీచర్‌కు 20 ఏళ్ల శిక్ష విధించింది. కాగా కోర్టు తీర్పుపై బాధితుల తరఫు న్యాయవాది సంతోషం వ్యక్తం చేశారు. బాధితులు బతికి ఉండగానే ఈ తరహా తీర్పు రావడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

HCA అవకతవకలపై రంగంలోకి దిగిన ఈడీ

image

TG: HCA <<17021009>>అవకతవకల <<>>వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. HCA కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. FIR, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా HCAలో నిధుల గల్లంతు, నకిలీ పత్రాలతో జగన్మోహన్ ఎన్నిక, ప్లేయర్ల ఎంపికలో అవకతవకలు వంటి అభియోగాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

News July 11, 2025

జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా?

image

రిషభ్ పంత్ గాయంపై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమ్ ఇండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ వచ్చారు.

News July 11, 2025

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

image

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.