News September 19, 2024

బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్

image

AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.

Similar News

News October 6, 2024

INDvsBAN: భారత్ టార్గెట్ 128 రన్స్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ఆ జట్టులో మిరాజ్ (35), షాంటో(27) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ 3 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. పాండ్య, మయాంక్ యాదవ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 128 రన్స్ చేయాలి.

News October 6, 2024

జట్టుతో ఉన్నప్పుడు స్నాక్స్ బాగా తినొచ్చు: గంభీర్

image

టీమ్ ఇండియా కోచ్‌గా ఉంటే చాలా ప్రయోజనాలుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో స్నాక్స్ తినడం కూడా ఒకటని గంభీర్ వెల్లడించారు. ‘ఆడనప్పుడు ఎన్నిసార్లైనా స్నాక్స్ తినొచ్చు’ అంటూ ఇన్‌స్టాలో ఆయన సరదా పోస్ట్ పెట్టారు. తినడమే కాకుండా జట్టుపై కూడా దృష్టి పెట్టండి అంటూ నెటిజన్లు కూడా ఆయనకు సరదా రిప్లైలు ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ద్రవిడ్ స్థానంలో గంభీర్ కోచ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఇష్టమైన రంగు ద్వారా మీ పర్సనాలిటీ తెలుసుకోండి?

image

ఎరుపు రంగును ఇష్టపడేవారు దృఢంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. బ్రౌన్ కలర్ ఇష్టమైన వారికి స్థిరత్వం, నమ్మకంగా ఉంటారు. గులాబీ రంగు ఇష్టపడేవారు అందరినీ సంతోషంగా ఉంచుతారు. ఆకుపచ్చ ఇష్టపడేవారు ప్రశాంతంగా ఉంటారు. పసుపు రంగు ఇష్టపడేవారు క్రియేటివ్‌గా ఉంటారు. తెలుపు ఇష్టపడేవారు స్వచ్ఛంగా ఉంటారు. నీలం రంగు ఇష్టపడేవారు సాదాసీదాగా ఉంటారు. నారింజ రంగు వారు ఏకాగ్రతతో ఉంటారు. నలుపును ఇష్టపడేవారు ఎవ్వరికీ అర్థం కారు.