News November 14, 2024

‘గేమ్ ఛేంజర్’ కోసం షారుఖ్ ఖాన్?

image

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా, అంజలి కీలకపాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News December 14, 2024

అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫోన్ కాల్

image

తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. అరెస్ట్ ఘటనపై వివరాలను వారు ఆరా తీశారు. మరోవైపు ముంబైలో వార్-2 షూటింగ్‌లో బిజీగా ఉండటంతో వచ్చాక కలుస్తానని ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం. అంతకుముందు బాలకృష్ణ కూడా అల్లు అర్జున్‌కు కాల్ చేశారు.

News December 14, 2024

అల్లు అర్జున్‌ను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన్ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్‌కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

News December 14, 2024

ప్రాణాలు పోస్తున్న గుండెలు ఆగిపోతున్నాయి!

image

వైద్యులు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లోని సీనియర్ డాక్టర్ ఆదిన్ అమీన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం ఆందోళనకరం. ఈక్రమంలో దీనికి గల కారణాలను వైద్యులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సుదీర్ఘ పని గంటలు, పనిలో తీవ్రమైన ఒత్తిడి, వైద్యుల అనారోగ్య జీవనశైలి, సరైన నిద్రలేకపోవడం, నివారణకు రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం’ అని చెప్తున్నారు.