News May 10, 2024

LSG ఓనర్‌పై షమీ విమర్శలు

image

LSG కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు యజమాని గోయెంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవర్తనపై టీమ్ ఇండియా బౌలర్ షమీ విమర్శలు చేశారు. ‘మీరు జట్టు ఓనర్. మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. ఇలాంటి వాటిని మైదానంలో అందరి ముందూ కాకుండా అంతర్గత సమావేశంలో లేక డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడి ఉంటే బాగుండేది. కేఎల్ మీ జట్టుకు కెప్టెన్. ఇది చాలా అవమానకరం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

ఓంకారేశ్వర చరిత్ర మీకు తెలుసా!

image

మధ్యప్రదేశ్‌లో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదిఒడ్డున ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో <<15487669>>నాల్గవది<<>>. స్థలపురాణం ప్రకారం.. పూర్వం వింధ్య పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు పర్వతరాజు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండేలా వరం కోరుతారు. దీంతో పరమేశ్వరుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే రెండు రూపాల్లో ఇక్కడ వెలిశారు. ఈ రెండు లింగరూపాలను ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు.

News February 18, 2025

TTD అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల డొనేషన్

image

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసీద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తుషార్‌ను వెంకయ్య సన్మానించి, అభినందించారు.

News February 18, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

image

AP: నంద్యాల(D) శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి MAR 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రేపు ఉ.9గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున CM CBN పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

error: Content is protected !!