News January 12, 2025

షమీ ఈజ్ బ్యాక్.. పంత్‌పై వేటు

image

దాదాపు ఏడాది విరామం తర్వాత షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చారు. 2023 వన్డే WCలో గాయంతో దూరమైన ఆయన ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. మరోవైపు BGTలో ఆశించినంతగా ఆకట్టుకోని రిషభ్ పంత్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వికెట్ కీపర్ కం బ్యాటర్లుగా శాంసన్, జురేల్‌ను ఎంపిక చేశారు. కాగా తొలి టీ20 ఈ నెల 22న కోల్‌కతాలో జరగనుంది.

Similar News

News January 22, 2025

పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయం: కోర్టులో పిటిషన్

image

జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్మిగ్రెంట్స్ రైట్స్ అడ్వకేట్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అమెరికా ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14న సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు జన్మతః పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.

News January 21, 2025

జన్మత: పౌరసత్వం రద్దు.. నెక్స్ట్ ఏంటి?

image

డొనాల్డ్ ట్రంప్ ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దు చేయడంతో పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ వీసా తీసుకొని ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అయితే వారిని ఇంటర్నేషనల్ స్టూడెంట్లుగా పరిగణిస్తారు. ఫలితంగా ఉపకారవేతనాలు లాంటి యూనివర్సిటీ బెనెఫిట్స్ ఏమీ అందవు. మరోవైపు ఈ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

News January 21, 2025

రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే

image

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.