News August 10, 2024
కోలుకుంటున్న షమీ.. త్వరలో రీఎంట్రీ?

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మహ్మద్ షమీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. NCAలో ఆయన రిహాబిలిటేషన్ ఫైనల్ స్టేజీకి చేరుకుందని, సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల్లో ఆడతారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దులీప్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లో అయినా అతడిని ఆడించి, ఫిట్నెస్ను టెస్ట్ చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ODI WC 2023 తర్వాత షమీకి చీలమండ గాయం కాగా, సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News October 24, 2025
గాజా డీల్‌ను బలహీనపరిస్తే నెతన్యాహుపై తీవ్ర చర్యలు!

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్‌ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్‌తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్‌ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.
News October 24, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 24, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.


