News August 10, 2024

కోలుకుంటున్న షమీ.. త్వరలో రీఎంట్రీ?

image

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మహ్మద్ షమీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. NCAలో ఆయన రిహాబిలిటేషన్ ఫైనల్ స్టేజీకి చేరుకుందని, సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల్లో ఆడతారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దులీప్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లో అయినా అతడిని ఆడించి, ఫిట్‌నెస్‌ను టెస్ట్ చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ODI WC 2023 తర్వాత షమీకి చీలమండ గాయం కాగా, సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News September 17, 2024

విమానాల్లో కన్నడ భాషలోనే మొదటి ప్రకటన చేయాలంటూ ప్రతిపాదన

image

బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో ల్యాండ్/టేకాఫ్ అయ్యే ప్ర‌తి విమానంలో మొద‌టి ప్ర‌క‌ట‌న‌ను క‌న్న‌డలోనే చేయాల‌ని క‌న్న‌డ సాహిత్య పరిష‌త్ కోరింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను సంస్థ ఛైర్మ‌న్ డా.మ‌హేశ్ జోషి సోమ‌వారం బెంగ‌ళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ హ‌రి మ‌రార్ ముందుంచారు. అయితే, దీనికి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌ర‌ని, ఆ మేరకు అనుమతి కోసం లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.

News September 17, 2024

ప్రశాంతంగా కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనం: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రేపు వర్కింగ్ డే కావడంతో ఆలస్యం కాకుండా త్వరగా నిమజ్జనం చేయాలని నిర్వాహకులను కోరారు. హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి గణేశులు తరలివస్తుండడంతో ట్యాంక్‌బండ్‌పై జనసందోహం నెలకొంది. నగరంలో ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి.

News September 17, 2024

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అల్లు అర్జున్ భరోసా?

image

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలికి అండగా నిలిచేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలికి తాను నటించే, గీతా ఆర్ట్స్ నిర్మించే అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ప్రకటించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఇప్పటికే ‘పుష్ప-2’లోనూ పని చేస్తున్నారని టాక్. తెలుగు అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలని ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్‌లో బన్నీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.