News November 12, 2024
క్రికెట్‌లోకి షమీ రీ ఎంట్రీ.. ఎప్పుడంటే..

పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ఏదో విధంగా ఆయన్ను టీమ్ ఇండియా ఆడించే అవకాశం ఉంది.
Similar News
News February 14, 2026
వాలంటైన్స్ డే: మహీకాకు హార్దిక్ అదిరిపోయే గిఫ్ట్!

వాలంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్య తన కాబోయే భార్య మహీకా శర్మపై ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నారు. మొదట ‘M’ అనే అక్షరాన్ని మాత్రమే అనుకున్నా చివరికి రెండు చిరుతపులుల డిజైన్‌ను ఎంచుకున్నారు. ఒక చిరుత బలానికి చిహ్నంగా ఉంటే, రెండోది మహీకా అక్షరం ‘M’ రూపంలో ఆమె ఉనికిని సూచిస్తుంది. ఇద్దరూ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తమ రిలేషన్‌లో కలిసి ప్రయాణించాలన్నదే టాటూ అర్థం.
News February 14, 2026
గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.
News February 14, 2026
పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.


