News January 7, 2025
షేర్లు విలవిల.. బిట్‌కాయిన్ కళకళ

గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్న వేళ క్రిప్టో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.43% పెరిగి $3.58Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ నిన్న $3,871 (Rs3.30L) పెరిగి $1,02,235ను తాకింది. నేడు $1,01,872 వద్ద ట్రేడవుతోంది. Mcap 2.74% ఎగిసి $2.01Tకి చేరుకుంది. ఎథీరియం $3,700 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. 1.42% లాభంతో $3,687 వద్ద ముగిసింది. ప్రస్తుతం $3,665 వద్ద కొనసాగుతోంది.
Similar News
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.
News November 22, 2025
పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
News November 22, 2025
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా నుంచి భారత్‌కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే కొనుగోళ్లు ఆపేశాయి. US, పశ్చిమాసియా నుంచి వచ్చే ఆయిల్‌తో దిగుమతి ఖర్చు పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.


