News May 26, 2024

షర్మిల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు: చింతా మోహన్

image

AP పీసీసీ చీఫ్ షర్మిల ఎవరితో చర్చించకుండా ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తాము ఆశించామని.. షర్మిల వ్యూహం తప్పయిందని అభిప్రాయపడ్డారు. టికెట్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఇవ్వలేదో తెలియదన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ కాంగ్రెస్ అని నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 23, 2026

రిపబ్లిక్ డే పరేడ్‌లో AP, TG శకటాలకు నో ఛాన్స్

image

ఢిల్లీలో నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈసారి 30 శకటాలను ప్రదర్శించనున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 13 కేంద్ర శాఖల శకటాలు ఇందులో ఉంటాయి. ఈ పరేడ్‌లో AP, TGకు చెందిన శకటాలకు అవకాశం దక్కలేదు. అందుకు సెలక్షన్ మాత్రమే కాకుండా.. డిఫెన్స్ మినిస్ట్రీ తీసుకొచ్చిన రొటేషన్ పాలసీ కూడా కారణం. 2024, 2025, 2026లో అన్ని రాష్ట్రాలు, UTలకు ఒక్క అవకాశమైనా వచ్చేలా చేస్తామని అందులో పేర్కొన్నారు.

News January 23, 2026

RCBని కొనేందుకు బిడ్ వేస్తా: అదర్ పూనావాలా

image

IPL ఫ్రాంచైజీ RCBని అమ్మేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీమ్‌ను కొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదర్ పూనావాలా కూడా ఉన్నారు. ఆయన ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ‘IPLలో అత్యుత్తమ జట్లలో ఒకటైన RCB ఫ్రాంచైజీని కొనేందుకు రానున్న నెలల్లో బలమైన, పోటీతో కూడిన బిడ్ వేస్తా’ అని పూనావాలా ట్వీట్ చేశారు.

News January 23, 2026

IIIT డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

IIIT DM కర్నూలులో 16 నాన్ టీచింగ్, 10 టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech/MSc/MCA, ME/MTech, MBA, BSc నర్సింగ్, B.PEd, డిప్లొమా, ITI, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా, టీచింగ్ పోస్టులను షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, PPT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitk.ac.in