News May 26, 2024

షర్మిల ఇష్టారాజ్యంగా వ్యవహరించారు: చింతా మోహన్

image

AP పీసీసీ చీఫ్ షర్మిల ఎవరితో చర్చించకుండా ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తాము ఆశించామని.. షర్మిల వ్యూహం తప్పయిందని అభిప్రాయపడ్డారు. టికెట్లకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఇవ్వలేదో తెలియదన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ కాంగ్రెస్ అని నెల్లూరులో ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News April 17, 2026

యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

image

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

News April 17, 2026

TG కాంగ్రెస్‌ను తలపించేలా విజయ్ మ్యానిఫెస్టో!

image

TN అసెంబ్లీ ఎన్నికల వేళ నిన్న TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19667137>>మ్యానిఫెస్టో<<>> TGలో కాంగ్రెస్ పార్టీ హామీలను తలపిస్తోంది. నెలకు 200యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని విజయ్ కూడా ప్రకటించారు. పెళ్లైన యువతులకు INC తులం బంగారం ఇస్తామనగా TVK చీఫ్ 8గ్రా. హామీ ఇచ్చారు. రేవంత్ రూ.500కే సిలిండర్ హామీ ఇవ్వగా విజయ్ ఏడాదికి 6 ఫ్రీగా ఇస్తామన్నారు. TG మాదిరే రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 వంటి హామీలను విజయ్ గుప్పించారు.

News April 17, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. పూర్తి వివరాలకు www.lichousing.com/careers చూడండి.