News March 18, 2024
కడప నుంచి షర్మిల పోటీ?

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారట. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం.
Similar News
News October 25, 2025
ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాను

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది ప్రస్తుతానికి పోర్ట్‌బ్లెయిర్‌కి 420KM, విశాఖకు 990KM, చెన్నైకి 990KM, కాకినాడకు 1000KM దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఎల్లుండికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో రాష్ట్ర తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.
News October 25, 2025
ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

TG: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.


