News March 18, 2024
కడప నుంచి షర్మిల పోటీ?

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారట. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలూ ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 25న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని సమాచారం.
Similar News
News April 17, 2026
ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ‘ఫౌజీ’!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం డైరెక్టర్ హను మునుపెన్నడూ లేని విధంగా నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్, సాలిడ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. డార్లింగ్ కటౌట్‌కు తగ్గట్టుగా మాస్ యాంగిల్‌ను హను చూపించబోతున్నారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
News April 17, 2026
అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అదానీ నెట్‌వర్త్ $92.6 బిలియన్లుగా ఉండగా, అంబానీ ఆస్తి $90.8 బిలియన్లుగా నమోదైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ ($656B) కొనసాగుతున్నారు.
News April 17, 2026
పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


