News April 11, 2024
DK బ్రదర్స్‌తో షర్మిల భేటీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తమ్ముడు ఎంపీ డీకే సురేశ్‌తో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులో వీరిద్దరితో ఆమె ఎన్నికల ప్రచారంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రచారం చేయాలని వారిని కోరినట్లు సమాచారం. కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 10 మంది కర్ణాటక నేతలతో కూడిన జాబితా తయారైనట్లు టాక్. ఆ జాబితాలో వీరిద్దరూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 16, 2026
విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.


