News October 29, 2024

విజయమ్మ లేఖపై స్పందించిన షర్మిల

image

విజయమ్మ రాసిన లేఖపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ‘రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన’ అంటూ తల్లి లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News November 9, 2024

అలాంటి పాత్రలు చేయను: సమంత

image

సమాజంలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని హీరోయిన్ సమంత చెప్పారు. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని, చిన్న రోల్స్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. యాడ్స్ విషయంలోనూ చాలా కచ్చితంగా ఉంటానని ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ‘సిటాడెల్: హనీబన్నీ’ కోసం చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. కాగా <<14525111>>ఐటమ్ సాంగ్స్<<>> చేయబోనని ఆమె ఇటీవల ప్రకటించారు.

News November 9, 2024

పవన్‌తో డీజీపీ తిరుమలరావు భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, అరెస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2024

దమ్ముంటే.. రాహుల్ గాంధీతో సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించండి: మోదీ సవాల్

image

దమ్ముంటే రాహుల్ గాంధీతో హిందుత్వ నేతలు వీర సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించాలని ఇండియా కూటమి నేతలకు PM మోదీ సవాల్ విసిరారు. వారు దేశానికి చేసిన సేవలపై మాట్లాడించాలన్నారు. సావర్కర్ తమకు స్ఫూర్తి అని, మరాఠీ చరిత్ర, సంస్కృతిని విశ్వసిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ గౌరవించదన్నారు. ఎన్నికల వేళ సావర్కర్‌ను విమర్శించొద్దని కాంగ్రెస్‌ యువరాజుకు MVA సీనియర్ ఒకరు సలహా ఇచ్చినట్టు వివరించారు.