News April 4, 2024
ఈ నెల 5 నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాసినాయన మండలం ఆమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
Similar News
News September 18, 2025
గర్భంపై గ్లైఫోసేట్ ఎఫెక్ట్

గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. అయితే ఇది ప్రెగ్నెన్సీపై ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా పిండం నాడీ వ్యవస్థ వృద్ధి చెందే మొదటి త్రైమాసికంలో గ్లైఫోసేట్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే అబార్షన్ జరగడం లేదా బిడ్డ పుట్టాక ఎదుగుదల లోపాలు వస్తాయి. గ్లైఫోసేట్ను మొక్కజొన్న, సోయా బీన్ పంటల్లో ఎక్కువగా వాడతారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ పదార్థాలను అవాయిడ్ చేయడం మంచిది.
News September 18, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను <<17735732>>అంతర పంటలు<<>>గా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News September 18, 2025
సినీ ముచ్చట్లు!

*పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్. పోస్టర్లు రిలీజ్
*నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ-2’ షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఓ పార్టీ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.
*‘సైయారా’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 9.3 మిలియన్ గంటల వ్యూయర్షిప్తో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ ఫిల్మ్‌గా నిలిచింది.