News November 12, 2024
YCP MLAలకు షర్మిల లేఖ
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న YCP MLAలకు APCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. ‘ప్రచారం నుంచి ప్రమాణం వరకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని MLAలుగా మీరు చెప్పిన మాటలను మళ్లీ గుర్తు చేస్తున్నా. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు మీరు దూరంగా ఉండటం బాధాకరం, అధర్మం. ఒక వ్యక్తి అహంకారాన్ని మీలోనూ నింపుకుని మీరు చూపుతున్న ఈ నిర్లక్ష్య వైఖరికి నష్టపోయేది ప్రజలు. వారి కోసం సభకు వెళ్లండి’ అని ఆమె లేఖలో కోరారు.
Similar News
News December 26, 2024
ప్రముఖ RJ, ఇన్‌స్టా ఫేమ్ ఆత్మహత్య
రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్‌లో సెక్టర్-47లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కు ఇన్‌స్టాలో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమెను ‘జమ్మూ కి ధడ్కన్’గా పిలుచుకుంటారు. సిమ్రాన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
News December 26, 2024
తుది శ్వాస వరకూ పోరాడతాం: ఖర్గే
గాంధీ-నెహ్రూల వారసత్వం తమకు ఉందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బెలగావి CWC సమావేశంలో మాట్లాడుతూ, ‘ఇక్కడి నుంచి మేం సంకల్పంతో తిరిగొస్తాం. ఐకమత్యంతో ప్రత్యర్థుల అబద్ధాల్ని తిప్పికొడతాం. ఎన్నికలు గెలిచే నైపుణ్యాన్ని పార్టీకి అందిస్తాం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేస్తాం. గాంధీ-నెహ్రూ సిద్ధాంతాల కోసం, అంబేడ్కర్ గౌరవం కోసం తుదిశ్వాస వరకూ పోరాడుతాం’ అని తెలిపారు.
News December 26, 2024
CWC మీటింగ్‌లో మ్యాప్ వివాదం
బెళగావిలో CWC మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారత చిత్రపటంలో కశ్మీర్‌లోని కొన్ని భాగాలు లేకపోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై వివరణ ఇవ్వాలని BJP డిమాండ్ చేసింది. జార్జ్ సొరోస్‌తో కలసి దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని విమర్శించింది. అయితే ఆ ఫ్లెక్సీని పార్టీ కాకుండా స్థానిక శ్రేణులు ఎవరో ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.