News November 12, 2024
YCP MLAలకు షర్మిల లేఖ
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న YCP MLAలకు APCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. ‘ప్రచారం నుంచి ప్రమాణం వరకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని MLAలుగా మీరు చెప్పిన మాటలను మళ్లీ గుర్తు చేస్తున్నా. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు మీరు దూరంగా ఉండటం బాధాకరం, అధర్మం. ఒక వ్యక్తి అహంకారాన్ని మీలోనూ నింపుకుని మీరు చూపుతున్న ఈ నిర్లక్ష్య వైఖరికి నష్టపోయేది ప్రజలు. వారి కోసం సభకు వెళ్లండి’ అని ఆమె లేఖలో కోరారు.
Similar News
News December 10, 2024
మోదీని పడగొట్టాలన్న సొరోస్ వైఖరికే కట్టుబడ్డారా: USకు BJP ప్రశ్న
మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న జార్జ్ సొరోస్ వైఖరికే కట్టుబడ్డారో లేదో చెప్పాలని అమెరికాను BJP డిమాండ్ చేసింది. భారత్‌పై విషం చిమ్ముతున్న OCCRP మీడియా సంస్థకు సొరోస్‌తో పాటు US డీప్‌స్టేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని గుర్తుచేసింది. వీటితో చేతులు కలిపే రాహుల్ గాంధీ భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆరోపించింది. OCCRP కొందరి ఒత్తిడితో తప్పుడు రాతలు రాస్తోందని ఫ్రెంచ్ జర్నలిస్టు బయటపెట్టారని తెలిపింది.
News December 10, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
News December 10, 2024
ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో మంటలు?
సినీ నటుడు మోహన్ బాబు తన శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్‌పూల్, సిబ్బంది గదులతోపాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఫిల్మ్ నగర్లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆరోపణ.