News November 28, 2024

EVMలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

image

EVMలు ట్యాంపరింగ్‌ అవుతున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంటే, ఆ పార్టీ MP శశిథరూర్ అందుకు భిన్నంగా స్పందించారు. EVMల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందని చెప్పారు. అనధికార EVMలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్లు భావిస్తే, నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకూ అవకాశం ఉందన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్లే అసలు సమస్య అని చెప్పారు.

Similar News

News January 15, 2026

షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

image

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.

News January 15, 2026

సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 15, 2026

ప్రహరీగోడ ఎత్తులో హెచ్చుతగ్గులు ఉండవచ్చా?

image

ఇంటి ప్రహరీగోడ ఎత్తు అన్ని వైపులా సమానంగా ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర గోడ కంటే తూర్పు గోడ ఎత్తు తక్కువగా, ఉత్తరం కంటే దక్షిణం వైపు గోడ ఎత్తుగా ఉండాలని చెబుతున్నారు. ‘ఈ హెచ్చుతగ్గులు కొంచెం ఉన్నా సరిపోతుంది. ఈ నిర్మాణం ఇంటి రక్షణకు, ఐశ్వర్యానికి తోడ్పడుతుంది. దిక్కులు బట్టి గోడల ఎత్తులు అమర్చుకుంటే ఇంట్లో శాంతి, సౌఖ్యం, స్థిరత్వం లభిస్తాయి’ అంటున్నారు. Vasthu