News November 28, 2024
EVMలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
EVMలు ట్యాంపరింగ్ అవుతున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంటే, ఆ పార్టీ MP శశిథరూర్ అందుకు భిన్నంగా స్పందించారు. EVMల ద్వారా దేశంలో ఓటింగ్ విధానం చాలా మెరుగైందని చెప్పారు. అనధికార EVMలు కలపడం వల్ల ఓటింగ్ శాతంలో మార్పు వస్తున్నట్లు భావిస్తే, నకిలీ ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులను కూడా కలిపేందుకూ అవకాశం ఉందన్నారు. యంత్రాలతో ఇబ్బంది లేదని, ఎన్నికల యంత్రాంగం వల్లే అసలు సమస్య అని చెప్పారు.
Similar News
News December 9, 2024
జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్
AP: సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చని నటి తరఫు లాయర్లు వాదించగా కోర్టు తోసిపుచ్చింది.
News December 9, 2024
ఏడాదికి రూ.2కోట్ల జీతం
TG: వికారాబాద్(D) బొంరాస్‌పేట(M) తుంకిమెట్లకు చెందిన సయ్యద్ అర్బాజ్ ఖురేషి జాక్‌పాట్ కొట్టారు. 2019లో IIT పట్నాలో బీటెక్ పూర్తి చేసిన ఇతను 2023లో AI, మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు. MSలో చూపిన ప్రతిభ ఆధారంగా దిగ్గజ సంస్థ అమెజాన్ అమెరికాలో అప్లైడ్ సైంటిస్టుగా రూ.2కోట్ల వార్షిక వేతనానికి ఎంపిక చేసింది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఖురేషి యువతకు సూర్ఫినివ్వాలని అతని తండ్రి ఆకాంక్షించారు.
News December 9, 2024
కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి
సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.