News September 10, 2024
హైప్‌కి పోయేలా ఉన్నాం శాస్త్రిగారు: అభిమానులు
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ట్రైలర్‌పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘సముద్రం అతడి పాదాక్రాంతం. సమయం అతడి ఆయుధహస్తం. భయోద్విగ్నం అతడి ప్రవేశం. ఈసాయంత్రం మొదలు.. దేశం దేవర కైవసం’ అని మూవీ ట్రైలర్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే సాంగ్స్, టీజర్ అంచనాలు పెంచేశాయి. ఇలా హైప్ పెంచేస్తే పోతాం శాస్త్రి గారు’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 9, 2024
‘RC16’లో రామ్ చరణ్ లుక్ ఇదేనా?
బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘RC16’లో రామ్ చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. క్రీడాప్రధానంగా సాగే ఈ కథలో చెర్రీ ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్‌లో ఉంది. ఈరోజు VV వినాయక్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విష్ చేశారు. గడ్డంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ లుక్‌లో చరణ్ మరో హిట్ కొడతారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News October 9, 2024
PAK vs ENG.. ఇలాంటి పిచ్‌తో టెస్టు క్రికెట్ నాశనం: పీటర్సన్
పాకిస్థాన్, ఇంగ్లండ్ టెస్టు ఆడుతున్న ముల్తాన్‌లో పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించని విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌలర్లకు అది శ్మశానం వంటిదంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రెండు రోజుల్లోనైనా ఫలితాన్నివ్వకపోతే ఈ పిచ్ టెస్టు క్రికెట్‌ని నాశనం చేసినట్లేనని మండిపడ్డారు. ఆ పిచ్‌పై వికెట్ తీసేందుకు బౌలర్లు చెమటోడుస్తుండటం గమనార్హం.
News October 9, 2024
గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్
TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.