News May 14, 2024

34 ఏళ్లకే నానమ్మ అయ్యారు..

image

30+ వయసులో పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో సింగపూర్‌లో షెర్లీ లింగ్ 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. ఈమె 17 ఏళ్లకే తొలిసారి తల్లయ్యారు. 3 పెళ్లిళ్ల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లకు జన్మనిచ్చారు. షెర్లీ పెద్ద కుమారుడు(17) గర్ల్‌ఫ్రెండ్ ద్వారా ఓ పాపకు తండ్రయ్యాడు. చిన్నవయసులో పిల్లల వల్ల ఎదురయ్యే పర్యవసానాలకు అతడితే బాధ్యత అని ఆమె చెప్పారు. తనను చూసి కొడుకు స్ఫూర్తి పొందాడేమో అని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు

image

TG: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. 3 ఏళ్ల LLB కోర్సుకు కనిష్ట ఫీజు ₹20వేలు, గరిష్టంగా ₹40,300, ఐదేళ్ల LLB కోర్సుకు ₹20 వేలు, ₹44,800గా ఫిక్స్ చేశారు. పీజీ లా కోర్సు ₹26,000, ₹50,400గా ఉంది. బీఈడీకి కనిష్టంగా ₹16,500, గరిష్ట ఫీజు ₹50,800, ఎంఈడీ కోర్సుకు ₹25వేలు, ₹45వేలుగా నిర్ణయించారు. 2027-28 అకడమిక్ ఇయర్ వరకు ఇవే ఫీజులు ఉండనున్నాయి.

News March 10, 2026

సమ్మర్‌లో కరెంట్ బిల్ తగ్గాలంటే!

image

✦ ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్ లైట్ల బదులు LED బల్బులు వాడాలి
✦ AC టెంపరేచర్‌ను 24-26°C మధ్య సెట్ చేయాలి. ఒక్క డిగ్రీ పెంచితే సుమారు 6% కరెంటు ఆదా
✦ AC ఆన్‌లో ఉండగా తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ కూడా ఆన్‌లో ఉంచితే రూమ్ త్వరగా చల్లబడుతుంది
✦ AC ఎయిర్ ఫిల్టర్‌ను 15 రోజులకోసారి శుభ్రం చేయాలి
✦ TV, ల్యాప్‌టాప్ ఛార్జర్, మైక్రోవేవ్ వంటివి స్టాండ్‌బై మోడ్‌లోనూ విద్యుత్ వాడతాయి. వాటిని ఆఫ్ చేయాలి

News March 10, 2026

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు వీరివే

image

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో మహ్మద్ షమీ (22) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జహీర్ ఖాన్ (17), బుమ్రా(16), అశ్విన్ (16), సచిన్ టెండూల్కర్ (15), రవీంద్ర జడేజా (15) ఉన్నారు. టీ20 WC ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నారు.