News September 1, 2024
7 నెలల గర్భంతో బరిలో దిగి చరిత్ర సృష్టించింది
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ గ్రిన్‌హమ్(బ్రిటన్) 7 నెలల గర్భంతో బరిలోకి దిగి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించారు. దీంతో పారాలింపిక్స్‌లో గర్భంతో పాల్గొని పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఫొబే పాటెర్‌సన్‌పై ఒక్క పాయింట్ తేడాతో(142-141) గెలుపొందారు. కడుపులో బిడ్డను మోస్తూ పతకం సాధించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
Similar News
News September 10, 2024
వారితో మనసు విప్పి మాట్లాడండి
ఈమధ్య సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యం అన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే వారు ఆత్మహత్య చేసుకుంటామని నేరుగా చెప్పకపోయినా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇస్తారని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రవర్తనలో మార్పు, ముభావంగా ఉండటం, నిరాశనిస్పృహలు ఉంటే వారితో మాట్లాడి, మనోధైర్యం నింపితే ఆత్మహత్య నుంచి కాపాడవచ్చంటున్నాయి.
>> నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం.
News September 10, 2024
RECORD: తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు 17 రోజుల ముందే నార్త్ అమెరికా అడ్వాన్స్ సేల్స్‌లో $1.05M దాటేసింది. దీంతో ట్రైలర్ కూడా రిలీజ్ అవకుండా అడ్వాన్స్ సేల్స్‌లో $1M మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచింది. కాగా ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ ఈవెంట్‌లో మూవీ నటీనటులందరూ పాల్గొనే అవకాశం ఉంది.
News September 10, 2024
అలాంటి వాహనాలకే పరిహారం: బీమా సంస్థలు
AP: విజయవాడ వరదల్లో ముంపునకు గురైన వాహనాలకు బీమా క్లెయిమ్‌లు వారంలోగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముంపునకు గురయ్యే నాటికి ఆ వాహనాల బీమా చలామణిలో ఉంటేనే పరిహారం అందుతుందని బీమా కంపెనీలు చెబుతున్నాయి. గడువు ముగిసినా, సకాలంలో రెన్యూవల్ చేసుకోకపోయినా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తీసుకున్నా క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నాయి. కాంప్రహెన్సివ్/ప్యాకేజీ పాలసీ తీసుకుని ఉండాలని అంటున్నాయి.