News April 13, 2024
ఈమె మామూలు మహిళ కాదు

భారీ స్కామ్‌లో మరణశిక్ష పడిన వియత్నాం సంపన్న <<13034140>>మహిళ<<>> ట్రూంగ్ మై లాన్ తెలివితేటలు ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. వందలకొద్దీ షెల్ కంపెనీలు, డజన్లకొద్దీ బినామీలతో ఆమె SCB బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి 12.5బిలియన్ డాలర్లను విత్‌డ్రా చేశారు. అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చారు. విత్‌డ్రా చేసిన ఆ రెండు టన్నుల బరువున్న నగదును ఇంటి బేస్‌మెంట్‌లో భద్రపరచడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.
Similar News
News March 10, 2026
జార్జియాకు బై.. అంటార్కిటికాకు ‘వారణాసి’ టీమ్?

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ జార్జియా షెడ్యూల్ ముగిసింది. మహేశ్ బాబు, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మూవీ యూనిట్ త్వరలోనే అంటార్కిటికాకు వెళ్లనుందని టాక్. ఈ షెడ్యూల్‌లో సూపర్ స్టార్‌తోపాటు ప్రియాంకా చోప్రా పాల్గొంటారని, అక్కడే ఓ సాంగ్ షూట్ జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అక్కడి లోకేషన్స్‌లో షూట్ చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలవనుందని తెలిపాయి.
News March 10, 2026
వంటగ్యాస్ పొదుపుగా వాడుకుంటే బెటర్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఈ ఛాలెంజెస్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో వంటగ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.


