News January 26, 2025
వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ

గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్‌లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.
Similar News
News February 15, 2025
టెన్త్ పాసైతే 32,438 ఉద్యోగాలు.. వారం రోజులే ఛాన్స్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ENGతో పాటు తెలుగులోనూ పరీక్ష రాయొచ్చు. <
News February 15, 2025
రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు: బండి సంజయ్

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ విరుచుకుపడ్డారు. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. తల్లి సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్థురాలు. రాహుల్ కులం మీద రేవంత్ ఏం సమాధానం చెప్తారు’ అని ప్రశ్నించారు.
News February 15, 2025
త్వరలో కాంగ్రెస్ నుంచి రేవంత్ బహిష్కరణ.. ఎర్రబెల్లి సంచలన కామెంట్స్

Tకాంగ్రెస్‌లో ముసలం ముదురుతోందని, త్వరలో రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని BRS నేత ఎర్రబెల్లి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్‌పై 25 మంది MLAలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మున్షీని ఆయన మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఇన్‌ఛార్జ్‌ని మార్చిందని ఆరోపించారు. త్వరలో తనను కూడా పీకేస్తారనే భయంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లి రాహుల్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.