News October 24, 2024
బ్రిటిష్ హయాం నాటి బంగ్లాలో షేక్ హసీనా!

బంగ్లా EX PM షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఓ లుటియన్స్ బంగ్లాలో వసతి కల్పించింది! అన్ని వసతులు, గార్డెన్ ఉండేలా లుటియన్స్ బంగ్లాలను 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. హసీనా గత హోదాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రులకు కేటాయించదగిన బంగ్లానే ఆమెకూ కేటాయించారు. భద్రత మధ్య లోధీ గార్డెన్స్‌కి తరచుగా ఆమె వాక్‌కి వెళ్తున్నట్టు తెలిసింది.
Similar News
News December 28, 2025
సీఎం, మాజీ సీఎంల భాషపై మెదక్ ఎంపీ కామెంట్స్

సీఎం, మాజీ సీఎంకు సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అసలు ఆ భాష ఏంటి.? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని, దేశంలో ఎన్నికలు జరిగితే ఒక్కొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని తెలిపారు. మోదీ నాయకత్వంలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెస్తామని స్పష్టం చేశారు.
News December 28, 2025
2 రోజుల్లో ముగిసిన టెస్టు.. రూ.60 కోట్ల నష్టం?

యాషెస్ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు రెండు రోజుల్లో <<18683393>>ముగియడమే<<>> దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దీంతో భారీగా బిజినెస్ కోల్పోయి, దాదాపు రూ.60 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు రెండో టెస్టు(పెర్త్) సైతం 2 రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు సిడ్నీ వేదికగా JAN 4న మొదలు కానుంది.
News December 28, 2025
నేటి ముఖ్యాంశాలు

✫ AP: టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు
✫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టం: అనిత
✫ మానవ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం: వైసీపీ
✫ TG: మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్
✫ ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
✫ జనవరి 5 నుంచి MGRNEGA బచావో అభియాన్: కాంగ్రెస్
✫ యాషెస్: నాలుగో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్


