News November 30, 2024
24 గంటల్లో శిండే పెద్ద నిర్ణయం తీసుకుంటారు: సంజయ్ శిర్సత్

మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై స్పష్టత రాని నేపథ్యంలో శిండే వర్గం నేత సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల్లో షిండే పెద్ద నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. కాగా సీఎం ఎవరనేది అమిత్ షానే నిర్ణయిస్తారని తెలిపారు. డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు శిండే ఆకస్మాత్తుగా సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News April 16, 2026
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News April 16, 2026
దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.


